సమంత ఫోటోకు 3 గంటల్లో పది లక్షల లైకులు.. ఏంటా ఫోటో

13 Aug, 2021 20:26 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉంది. సినిమాలు, బిజినెస్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాల విషయంలో చాలా సెలక్టివ్‌ పాత్రలు పోషిస్తున్న సామ్‌.. నటనకు ప్రాధాన్యం ఉండే సినిమాలకే ఓకే చెబుతోంది. ఈ క్రమంలో నిన్ననే(గురువారం) శాకుంతలం సినిమా షూటింగ్‌ పార్ట్‌ కూడా పూర్తి చేసుకుంది. 'థ్యాంక్యూ శకుంతల..' అంటూ ఆమెకు చిత్రం టీమ్ థాంక్స్ చెబుతూ వీడ్కోలు పలికింది. మరోవైపు సమయం చిక్కినప్పుడల్లా సమంత తన వుమెన్‌ క్లాతింగ్‌ బ్రాండ్‌ ‘సాకీ’ దుస్తులు, స్కూలింగ్ బిజినెస్ గురించి ప్రచారమూ చేసుకుంటోంది. 

తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటోనే. సమంత తన సొంత లేబుల్‌ 'సాకీ' దుస్తులు ధరించి కారులో కూర్చొని ఉన్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘మై లవ్‌ సాకీ వరల్డ్‌’ అంటూ సమంత పోస్ట్ చేసిన ఈఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఫోటోకి క్షణాల్లో లక్షల లైకులు వచ్చి చేరుతున్నాయి. కేవలం ఈ ఫోటో పోస్ట్ చేసిన 3 గంటలలోనే 10 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. ఇంతకు అంతలా ఆ ఫొటోలో ఏముందో మరి మీరూ చూడండి. 

A post shared by S (@samantharuthprabhuoffl)

మరిన్ని వార్తలు