‘లైగర్‌’న్యూడ్‌ పోస్టర్‌పై సమంత ఆసక్తికర కామెంట్‌

3 Jul, 2022 11:13 IST|Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌ మారాడు. దానికి కారణంగా ఆయన తాజా సినిమా ‘లైగర్‌’ నుంచి ఓ ఫోటో వదలడమే. అయితే అది సాధారణ ఫోటో అయితే అంతగా వైరల్‌ కాకపోవచ్చు. అది న్యూడ్‌ ఫోటో. ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఆ ఫోటోని విడుదల చేసింది ‘లైగర్‌’ టీమ్‌. ఈ ఫోటోపై అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిసస్తున్నారు. 

విజయ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ సమంత కూడా న్యూడ్‌ ఫోటోపై బోల్డ్‌ కామెంట్‌ చేసింది. విజయ్‌కి నియమ నిబంధనలు బాగా తెలుసు. కాబట్టి వాటిని బ్రేక్‌ చేయగలడు కూడా. ధైర్యం, కీర్తి ఆయన సొంతం. లైగర్‌ పోస్టర్‌ అదిరింది’అని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది.

(చదవండి: లైగర్ బోల్డ్ పిక్.. అసలు విషయం ఇదే..!!)

సామ్‌ కామెంట్‌కి విజయ్‌ రిప్లై ఇచ్చాడు. ‘సామ్‌  నువ్వు బెస్ట్‌’అని విజయ్‌ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. సమంతతో పాటు తమన్నా, అనుష్క, జాన్వీ కపూర్‌, రాశీఖన్నా కూడా ఆ పోస్టర్‌పై స్పందింస్తూ.. విజయ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. లైగర్‌ విషయానికొస్తే..విజయ్‌ దేవరకొండ తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

మరిన్ని వార్తలు