లవ్‌ స్టోరీ చిత్రానికే హైలైట్.. ‘సారంగధరియా..’

27 Feb, 2021 05:37 IST|Sakshi

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ స్టోరి’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, అమిగోస్‌ క్రియేష¯Œ ్స పతాకాలపై కె. నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కానుంది. ఈ చిత్రంలో ‘సారంగధరియా..’ అంటూ సాగే మూడో పాటని హీరోయిన్‌  సమంత ఈ నెల 28న విడుదల చేయనున్నారు.

కె.నారాయణదాస్‌ నారంగ్, పి.రామ్మోహన్‌  రావు మాట్లాడుతూ– ‘‘శేఖర్‌ కమ్ముల చిత్రంలో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ‘లవ్‌ స్టోరి’ చిత్రంలో పాటలకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకు తగినట్లే పవన్‌  సీహెచ్‌ మంచి సంగీతం అందించారు. ఇప్పటికే తొలి పాటగా రిలీజ్‌ చేసిన ‘హే పిల్లా..’ దాదాపు 15 (కోటీ యాభై లక్షలు) మిలియన్ల వ్యూస్‌ సాధించింది.

 రెండో పాట ‘నీ చిత్రం చూసి’కి 3 మిలియన్లపైగా వ్యూస్‌ వచ్చాయి. మూడో పాట ‘సారంగధరియా..’ లవ్‌ స్టోరీ చిత్రానికే హైలైట్‌గా ఉండబోతోంది. ఈ పాటలో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌  పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ సి.కుమార్, సహ నిర్మాత: భాస్కర్‌ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఐర్ల నాగేశ్వరరావు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు