Krishna Vrinda Vihari: రా .. వెన్నెల్లో వర్షంలా ’ ఆకట్టుకుంటున్న మెలోడి

9 Apr, 2022 12:35 IST|Sakshi

యంగ్‌ హీరో నాగశౌర్య, షిర్లీ సెటియా జంటగా నటించిన రొమాంటికి అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్‌ సాంగ్‌ని స్టార్‌ హీరోయిన్‌ సమంత విడుదల చేసింది. ‘బ్యూటిఫుల్‌ సాంగ్‌ విత్‌ బ్యూటిఫుల్‌ పీపుల్‌’అంటూ ట్వీట్‌ చేస్తూ  సామ్‌ ఈ పాటకు సంబంధించిన యూట్యూబ్‌ లింక్‌ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘రా .. వెన్నెల్లో వర్షంలా .., రా .. వర్షంలో వెన్నెల్లా .. అంటూ సాగే ఈ రొమాంటిక్‌ సాంగ్‌ని ఆదిత్య ఆర్కే, సంజన కాల్మంజే ఆలపించగా, మహతి స్వరసాగర్‌ అద్భుత సంగీతాన్ని అందించాడు. 

మరిన్ని వార్తలు