ముంబైలో ఇల్లు కొనబోతోన్న సమంత!

7 Jul, 2021 20:37 IST|Sakshi

మన తెలుగు హీరోయిన్స్‌ ఇటూ సినిమాల్లో నటిస్తూ మరో పక్క బిజినెస్‌లోకి అడుగు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నా డైమండ్‌ బిజినెస్‌ ప్రారంభించగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జిమ్‌ స్టార్ట్‌ చేసింది. టాలీవుడ్‌ అడుగుపెట్టిన కొద్ది రోజులకే రకుల్‌ ఇక్కడ సొంతగా ఇల్లు కొనుక్కున్న సంగతి విధితమే. ఇక అక్కినేని కోడలు, అగ్రనటి సమంత సైతం ఫ్యాషన్‌ డిజైన్స్‌లో బిజినెస్‌ మొదలు పెట్టిగా.. కొత్తగా నగల వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సమంతకు సంబంధించిన మరో అసక్తికర విషయం సోషల్‌ మీడయాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఇటూ బిజినెస్‌ పరంగా అటూ వరుస సినిమాల్లో నటిస్తూ భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న సమంత రెండు చేతులా బాగానే డబ్బు సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఆమె ముంబైలో ఓ ప్లాట్‌ కోనేందుకు సిద్దమైందట. ఇందుకోసం ఆమె అక్కడ మంచి ప్లాట్‌ను వేతికే పనిలో పడిందట. అయితే త్వరలోనే తన బాలీవుడ్‌ ఎంట్రీ నేపథ్యంలో ముంబై నగరంలో ఓ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో సమంత ప్లాట్‌ను కోనాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ మూవీలో నటిస్తున్న సమంత తన తదుపరి చిత్రం హిందీలో ఉండబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. కాగా ఇప్పటికే మెగా హీరో రామ్‌చరణ్‌, ఉపాసనలు ముంబైలో ఓ ఇళ్లు కొన్నట్లు వినికిడి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు