‘మాస్టర్‌’ను రిపీట్ చేస్తున్న లోకేష్..హీరోయిన్ గా సమంతకు ఛాన్స్?

7 Jun, 2022 15:12 IST|Sakshi

విక్రమ్ తో కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్. ఆయన మేకింగ్‌కి ఒక్క కోలీవుడ్‌ మాత్రమే కాదు.. టోటల్‌ సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ షేక్‌ అవుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ తో తన సినిమాల్లో హీరోలకు అప్లై చేస్తూ ప్రతీసారీ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాడు లోకేష్ కనగరాజ్. ఖైదీతో కార్తికి మాస్టర్ తో విజయ్ కు బ్లాక్ బస్టర్ రిపీట్ చేశాడు. ఇప్పుడు కమల్‌కు కూడా సూపర్‌ హిట్‌ అందించాడు.

(చదవండి: ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్​లు)

ఇక తన తర్వాతి సినిమా మాత్రం వీటన్నిటికి మించిన బ్లాక్‌ బస్టర్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాడట లోకేష్‌. ఆయన తదుపరి చిత్రం కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘మాస్టర్‌’ బ్లాక్‌ బస్టర్‌ కావడంతో.. రాబోయే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే మంచి స్క్రిప్ట్‌ రేడీ చేశాడట లోకేష్‌.

ఈ మూవీలో యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయని చెబుతున్నాడు.ఈ ప్రాజెక్ట్ లోకి లెడీ సూపర్ స్టార్ సమంత అడుగుపెడుతోందని సమాచారం.ఈసారి హీరోతో పాటు హీరోయిన్ కు కూడా యాక్షన్స్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ లోకేష్. అందుకే లేడీ సూపర్ స్టార్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట.విజయ్, సమంత కలసి నటించిన ప్రతీసారి కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ను అందుకుంది.కత్తి, తేరీ, మెర్సల్ మూవీస్ లో ఈ కాంబినేషన్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసింది.ఇప్పుడు మరోసారి హిట్ పెయిర్ ను రిపీట్ చేసేందుకు లోకేష్ ట్రై చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు