Samantha Koffee With Karan: టాలీవుడ్‌ నెపోటిజంపై సమంత ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

22 Jul, 2022 11:39 IST|Sakshi

బాలీవుడ్‌ పాపులర్‌ షో కాఫీ విత్‌ కరణ్‌ ప్రస్తుతం 7వ సీజన్‌ను జరుపుకుంటుంది. ఈ సీజన్‌కు సంబంధించిన ఎపిసోడ్స్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో లెటెస్ట్‌ ఎపిసోడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ సమంత సందడి చేసింది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌తో కలిసి ఆమె ఈ షోలో పాల్గొంది. అయితే ఈ ఎపిసోడ్‌ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమంత ఎపిసోడ్‌ తాజాగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

చదవండి: Koffee With Karan: నాగ చైతన్యతో విడాకులు, భరణంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ సందర్భంగా కరణ్‌ సమంతను విడాకులు, ట్రోల్స్‌పై పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగగా సమంత తనదైన శైలిలో సమాధానం చెబుతూ వచ్చింది. అలాగే టాలీవుడ్‌ నెపోటిజంపై కూడా తనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సామ్‌ స్పందిస్తూ.. ‘టాలీవుడ్‌లో చాలా మంది హీరోల పిల్లలు, వారి బంధువుల పిల్లలు మాత్రమే హీరోలు అవుతారు.. కానీ విజయ్‌ దేవరకొండ లాంటి వ్యక్తులు స్టార్‌గా మారడం చాలా అరుదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కరణ్‌ టాలీవుడ్‌ను ‘బిగ్‌ బాయ్స్‌ క్లబ్‌’ అని కామెంట్స్‌ రావడం తాను విన్నానని, దీనిపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించాడు. 

‘నాకు తెలిసి రెండు ఆపిల్స్‌ ఒకెలా ఉండవు. ఒక  ఆపిల్ నుంచి మరో ఆపిల్‌కు భిన్నంగా ఉంటుందని అనుకుంటున్నాను. నెపో పిల్లలు.. నాన్ నెపో పిల్లలు. ప్రతి ఒక్కరు తమ సొంత ఆలోచనలు, ప్రతిభ కలిగి ఉంటారు. వారికి కూడా టాలెంట్ ఉంటుంది. ఉదాహరణకు ఒక తండ్రి కోచ్‏గా ఉన్నప్పుడు అతని కుమారుడు గేమ్ ఆడుతున్న సమయంలో పక్కన నిలబడి చూడటం తప్పా, కొడుకును గెలిచేందుకు ఏం చేయలేడు కదా. ఇది అలాగే’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత సపోర్ట్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టడంపై(ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్) తన అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘ఆ అడ్వంటేజ్‌ అనేది మొదటి సినిమాల వరకు మాత్రమే ఉంటుంది.

చదవండి: ఓటీటీ హావా.. ఈ ఒక్క రోజే ఏకంగా 13 సినిమాలు సందడి

సరే రెండు, మూడు, నాలుగు సినిమాలకు కూడా ఉండోచ్చు. అంతకంటే ఉండదు కదా. అదే నన్ను చూసుకుంటే. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా సినిమాలు ఫెయిల్‌ అయినా, డిజాస్టర్‌ అయినా మా అమ్మ-నాన్నలకు, సోదరులకు మాత్రమే తెలుస్తుంది. అదే స్టార్‌ హీరోల పిల్లలు ఫెయిల్‌ అయితే దేశం మొత్తం తెలిసిపోతుంది. వారిని ఎప్పుడు ట్రోల్‌ చేస్తుంటారు. వారిని వారసత్వంతో పోలుస్తూ విమర్శలు చేస్తుంటారు. సూపర్ స్టార్స్ అందరూ గొప్ప నటులని, గొప్ప నటులందరూ సూపర్ స్టార్స్ అని నేను అనుకోను.  దైవానుగ్రహంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. మన సక్సెస్ నిర్ణయించేది ప్రేక్షకులే’ అంటూ సామ్‌ చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు