నా కెరీర్‌లో ప్రధానంగా మూడు మార్పులొచ్చాయ్‌: సమంత

1 Jul, 2021 21:07 IST|Sakshi

‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను సమంత మాయ చేసిందనే చెప్పాలి. సినీ పరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్‌ గ్రౌండ్‌, సపోర్ట్ లేకుండా  ఎంట్రీ ఇవ్వడమే కాకుండా హీరోయిన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సంపాదించింది ఈ చెన్నై బ్యూటీ. ప్రస్తుతం సౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు ఫ్యాన్సును సంపాదించుకున్న సామ్‌ ఇటీవల వెబ్‌సిరీస్‌లోనూ అడుగు పెట్టి అక్కడ కూడా తన హవా కొనసాగిస్తోంది.

తాజాగా ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సామ్ తన కెరీర్‌ ప్రారంభించి 11 సంవత్సరాలు కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తనలో వచ్చిన మూడు ప్రధాన మార్పులను చెప్పుకొచ్చింది. సామ్‌ ఆ ఇంటర్వ్యూలో.. కెరీర్‌ పరంగా తాను చాలా అంటే చాలా కష్టపడి పనిచేసే వ్యక్తినని, అదే సమయంలో కాస్త అభ‌ద్ర‌తా భావం, అనేక స్వీయ సందేహాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.

నా సినీ కెరీర్‌లో ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్న కొద్ది వాటిని అధిగమించడం నేర్చుకుంటూ, అదే క్రమంంలో నా అభద్రతాభావాలను తగ్గించుకోవడమే గాక పెద్ద రిస్క్‌లు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పుడు తనపై నమ్మకంగా ఉందని, ముందున్న భయాలు, అభద్రతాభావాలను పక్కన పెట్టేసి, పెద్ద రిస్క్‌ల‌నైనా తీసుకోవ‌డం లాంటి మూడు ప్రధాన మార్పులు త‌న‌లో వ‌చ్చాయ‌ని సామ్‌ చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు