-

నేను చూసిన ఉత్తమం చిత్రం ఇదే.. ఆ హీరోయిన్‌పై సామ్ ప్రశంసలు!

27 Nov, 2023 15:08 IST|Sakshi

ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే చికిత్స కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉంటోన్న సామ్ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ మూవీని చూసిన సమంత తన రివ్యూను అభిమానులతో పంచుకున్నారు.  సామ్ తాజాగా మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన కాథల్-ది కోర్‌ చిత్రంపై తన రివ్యూను ప్రకటించారు. 

సమంత ట్విట్టర్‌లో రాస్తూ.. 'కాథల్-ది కోర్‌ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో నేను చూసిన ఉత్తమ చిత్రం ఇదే. తప్పకుండా అందరు కలిసి చూడాల్సిన చిత్రమిది.  మమ్ముట్టి నా అభిమాన హీరో.  ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మూవీ ఫీల్‌ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమాలు చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లవ్ యూ జ్యోతిక' అంటూ పోస్ట్‌ చేసింది.

అలాగే మూవీ డైరెక్టర్ జీయో బాబీని లెజెండ్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. సమంత పోస్ట్‌పై కాథల్ ది కోర్‌ చిత్ర నిర్మాణ సంస్థ కూడా స్పందించింది. ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. కాగా.. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును ప్రధానంగా ఈ మూవీలో చూపించారు. 
 

మరిన్ని వార్తలు