ఖుషి షూటింగ్‌లో ప్రమాదం.. విజయ్‌, సామ్‌కి గాయాలు?

23 May, 2022 22:44 IST|Sakshi

Vijay Devarakonda-Samantha: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్‌ హీరోయిన్‌ సమంత జంటగా కలిసి నటిస్తున్నసినిమా 'ఖుషి'. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కశ్మీర్‌ తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్‌లో చిత్రీకరిస్తుండగా విజయ్‌, సమంతకి గాయలయ్యాయని, ఆ వెంటనే వీరిద్దరినీ సమీప ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు టాక్‌.

వివరాల ప్రకారం.. సమంత, విజయ్ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో వారికి గాయాలైనట్లు సమాచారం. షూటింగ్ చేస్తుండగా వీరిద్దరు లిడర్ నదికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపవలసి వచ్చిందట. కానీ ఆ సీన్‌ చేస్తున్నప్పుడు నీటిలో పడడందో వీరికి గాయాలైనట్లు సమాచారం. తక్షణమై స్పందించిన చిత్ర యూనిట్‌ వీరిద్దరికి చికిత్స అందించారు. ఈ ఘటనపై చిత్ర యూనిట్‌ నుంచి ఎటువంటి సమాచారం లేదు. కాగా కాశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తయినట్లు డైరెక్టర్‌ శివనిర్వా‍ణ ట్విటర్‌లో తెలిపారు. ‘ఖుషి’ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్‌ 23, 2022న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది. కాగా ఈ మూవీతో పాటు విజయ్‌, పూరీ జగన్నాథ్‌తో జనగనమణ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

చదవండి: Vijay Devarakonda-Samantha: విజయ్‌, సమంతలకు థ్యాంక్స్‌ అంటూ డైరెక్టర్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌!

మరిన్ని వార్తలు