శాకుంతల సిద్ధమవుతున్నారు

26 Feb, 2021 04:02 IST|Sakshi

సమంత నటించనున్న తొలి పీరియాడికల్‌ చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ఆరంభం కానుంది. దుష్యంతుడు–శాకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు గుణశేఖర్‌. శకుంతల పాత్రలో సమంత కనిపిస్తారు. గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమా నిర్మిస్తారు. మార్చి 20న హైదరాబాద్‌లో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ను నిర్మిస్తున్నారు. ప్యాన్‌  ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో ఓ మలయాళ నటుడు కనిపిస్తారని టాక్‌. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు