Samantha Shaakuntalam Movie: సమంత చిత్రం వాయిదా, 3డీలో రాబోతున్న ‘శాకుంతలం’

30 Sep, 2022 08:07 IST|Sakshi

సమంత లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాని నవంబర్‌ 4న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ఆ మధ్య ప్రకటించింది. అయితే ‘శాకుంతలం’ని 3డీలో అందించాలనే నిర్ణయంతో సినిమా విడుదలని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది.

చదవండి: అయోధ్యలో ఆది పురుష్‌ టీజర్‌, ఫస్ట్‌ పోస్టర్‌

‘‘శకుంతల, దుష్యంత మహారాజు మధ్య ఉన్న అజరామరమైన ప్రణయగాథ ఇది. భారీ స్థాయిలో, అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. అందుకే ఇంతకు ముందు ప్రకటించిన తేదీకి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం.. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం’’ అని చిత్ర యూనిట్‌ తెలియజేసింది. ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటించారు. డా. ఎం. మోహన్‌ బాబు, ప్రకాష్‌రాజ్, సచిన్‌ ఖేడేకర్, కబీర్‌ బేడీ, మధుబాల, గౌతమి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.   

మరిన్ని వార్తలు