Shakuntalam: సమంత 'శాకుంతలం' నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌కు రెడీ

23 Jan, 2023 15:57 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా అంటూ సాగే మెలోడీ సాంగ్‌ విడుదలై ఆకట్టుకోగా ఇప్పుడు “ఋషివనములోనా” అనే సాంగ్‌ రిలీజ్‌కు సిద్ధమైంది.

ఈనెల 25న ఈ పాటను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. శకుంతల, దుష్యంతల ప్రేమని చూపించేలా ఈ సెకండ్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అవుతున్న శాకుంతలం సినిమాకు మనిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు