Samantha : సమంత పూర్తిగా కోలుకున్నట్లేనా? హార్స్‌ రైడింగ్‌ చేస్తూ విన్యాసాలు

26 Feb, 2023 11:30 IST|Sakshi

సమంత ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకొని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటుంది. చివరగా యశోద సినిమాతో అలరించిన సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో బాక్సాఫీస్‌ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సమంత విజయ్‌ దేవరకొండతో ఖుషీ సినిమాతో పాటు సిటాడెల్‌ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది.

ఫ్యామిలీ మెన్‌’ వెబ్‌ సిరీస్‌ డైరెక్టర్స్‌ రాజ్‌-డికే ‘సీటాడెల్‌’ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ కోసం సామ్‌ ప్రత్యేకంగా హార్స్‌ రైడింగ్‌ నేర్చుకుంటుంది. దీనికి సంబంధించిన ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో సమంత మయోసైటిస్‌ నుంచి పూర్తిగా కోలుకొని ఇలా కనిపించడం సంతోషంగా ఉందని కామెంటస​్‌ చేస్తున్నారు. 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మరిన్ని వార్తలు