సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ స్టార్‌ హీరోయిన్‌ని గుర్తు పట్టారా?

25 Jan, 2022 14:53 IST|Sakshi

పై ఫోటోలో  ఉన్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో  గుర్తు పట్టారా? ముక్కు.. మూతుల్ని చూపిస్తే ఎంతోకొంత గుర్తు పట్టొచ్చు కానీ..  కెమెరాకు వెన‌కా నుంచి ఫోజులిస్తే ఎలా గుర్తుపడతాం అంటారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి ఒక క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. ఆమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఇటీవల ఆమె  తొలిసారి ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. ఈ క్లూతో ఈపాటికే మీరు ఆ స్టార్‌ హీరోయిన్‌ని గుర్తించే ఉంటారు.

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

కెమెరాకు వెన‌కా నుంచి ఫోటోకి ఫోజులిచ్చింది సమంతానే. ప్రస్తుతం ఈ బ్యూటీ స్విట్జ‌ర్లాండ్‌లో హాలీడే ట్రిప్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతుంది.  తాను విడిది కోసం దిగిన హోటల్‌ బాల్కనీలో ఓ ఫోటో దిగి, దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘దీనికి అల‌వాటు ప‌డాలి’అనే క్యాప్షన్‌ ఇచ్చింది సమంత. జీన్స్ ధరించి ఉన్న సామ్‌ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఇక సామ్‌ సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే ఆమె గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్‌ చేసుకుంది. ప్రస్తుతం  తమిళంలో విజయ్‌ సేతుపతితో  ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అలాగే ఓ హాలీవుడ్‌ చిత్రానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు