ప్రియాంక వీడియోకి సమంత ఫిదా.. ఇంతకీ అందులో ఏముందంటే?

6 Jan, 2022 16:26 IST|Sakshi

నాగ చైతన్యతో విడాకుల అనంతరం కెరీర్‌ పరంగా దూసుకెళ్తోంది సమంత. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యింది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసి అదరగొట్టింది. అలాగే యశోధ మూవీకి సంబంధించిన షూటింగ్‌ని కూడా కంప్లీట్‌ చేసుకుంది. వీటితో పాటు అటు బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్దమైంది. ఇప్పటికే డ్రీమ్‌ వారియర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఓ మూవీ చేస్తోంది. ఇలా వరుస సినిమాలతో బీజీగా ఉన్నా... సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది సామ్‌. ఇటీవల ఎక్కువగా మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాకి సంబంధించిన ఓ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రియాంక మాటలు బాగా నచ్చాయంటూ.. హార్ట్‌ సింబల్‌ షేర్‌ చేసింది. దీంతో నెటిజన్స్‌ అంతా ప్రియాంక వీడియోని వెతకడం ప్రారంభించారు.

ఇంతకీ ఆ వీడియోలో ప్రియాంక ఏం చెప్పారంటే.. ‘నా చిన్నతనం నుంచి మా నాన్న, నాకు 9 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి మా అమ్మ అనేక విషయాలు నాతో షేర్‌ చేసుకున్నారు. ‘నువ్వు ఏదైనా చేయాలకుంటే.. అంతకన్నా ముందు నువ్వు ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి. నువ్వు ఎవరి కూతురివి, ఎవరిని పెళ్లి చేసకుంటున్నావు అనేది ముఖ్యం కాదు. నీ కాళ్లపై నువ్వు నిలబడాలి’అని చెప్పేవాళ్లు. ఆ మాటలు నా మెదడులో బలంగా ఉండిపోయాయి. అందుకే నేను నా 12 ఏళ్ల వయసు నుంచి వాటిని ఆచరించడం మొదలు పెట్టా. ప్రతి ఏట నేను ఏయే స్థానాలకు వెళ్లాలనుకున్నానో నిర్ణయించుకొని, నా లక్ష్యాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నా’అని ప్రియాంక చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు