Samantha In Koffee With Karan: ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బులిచ్చా.. సమంత షాకింగ్‌ కామెంట్స్‌

24 Jul, 2022 08:18 IST|Sakshi

సినీ సెలబ్రిటీలలో సమంత రూటే సపరేటు. కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి వెళ్లి రెండు భాషల్లోనూ కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటి సమంత. ది ఫ్యామిలీ మెన్‌–2 వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో బోల్డ్‌ పాత్రలో నటించి ప్రశంసలతో పాటు విమర్శలను ఎదుర్కొన్నారు. వర్కౌట్స్, గ్లామర్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉంటారు. నాగ చైతన్యతో పెళ్లి, విడాకుల తరువాత ఆమె క్రేజ్‌ తగ్గుతుందని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా ఆమె స్టార్‌డం మరింత పెరిగింది. తాజాగా ఈ అమ్మడు మరోసారి వివాదాల్లో కెక్కారు.

(చదవండి: మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్‌ షాకింగ్‌ రియాక్షన్‌)

ఆర్‌ మాక్స్‌ అనే సంస్థ భారతీయ సినీ హీరోయిన్లలో అత్యంత పాపులారిటీ కలిగిన వారెవరన్నది గురించి చేసిన సర్వేలో నటి సమంతనే నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ తరువాత స్థానాల్లో బాలీవుడ్‌ నటి అలియా భట్, నయనతార, కరీనాకపూర్, పూజా హెగ్డే తదితరులు నిలిచారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న సమంతను ఆర్‌ మాక్స్‌ సంస్థ సర్వేలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఎలా దక్కించుకున్నారు అన్న బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ ప్రశ్నకు నిజం చెప్పనా అంటూ తాను ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు బదులిచ్చారు. ఆమె కామెడీగా అన్న  వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికి దారి తీశాయి. అంతేకాకుండా నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు