ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూస్తాను: సమంత

6 Dec, 2020 02:16 IST|Sakshi
ప్రశాంత్‌ వర్మ, తేజ, సమంత, ‘దిల్‌’ రాజు

– సమంత

‘‘జాంబిరెడ్డి’ సినిమా టీజర్‌ అదిరిపోయింది. నా ఊహను మించిపోయింది. ఈ సినిమాను ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూస్తాను. నాకు సినిమాలంటే ప్రాణం’’ అన్నారు సమంత. తేజ సజ్జా, ఆనంది, దక్షా నగార్కర్‌ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రాజ్‌ శేఖర్‌ వర్మ నిర్మించిన  చిత్రం ‘జాంబిరెడ్డి’. ఈ సినిమా టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సమంత విడుదల చేశారు. పోస్టర్‌ను విడుదల చేసిన ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘టైటిల్‌ డిఫరెంట్‌గా ఉంది. టీజర్‌తో ప్రశాంత్‌ వర్మ భయపెడుతున్నాడు. ‘ఇంద్ర’ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ సజ్జా హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు.

‘‘లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్‌ను సగం పూర్తి చేశాం. మిగిలిన భాగాన్ని లాక్‌డౌన్‌ తర్వాత పూర్తి చేశాం. నేనేదో తెలివైనవాడిని అని చెప్పుకోవడానికి ఈ సినిమా తీయలేదు. ఎంటర్‌టైన్‌ చేయడం కోసం తీశాను. ఈ సినిమా హిట్‌ సాధిస్తే ‘జాంబిరెడ్డి’ లెవల్‌ 2 స్క్రిప్ట్‌ ఉంది. నన్ను నమ్మిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు ముందు సమంతగారితో ఓ సినిమా అనుకున్నాను’’ అన్నారు ప్రశాంత్‌ వర్మ. ‘‘ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను చూస్తారు’’ అన్నారు తేజ సజ్జా. ఈ కార్యక్రమంలో ఆనంది, దక్షా నగార్కర్, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు పి. కిరణ్, బెక్కం వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు