Samantha: చై ఙ్ఞాపకాలు సామ్‌ను వెంటాడుతున్నాయా? ఆ బుక్‌తో కనిపించడంతో..

5 Aug, 2022 16:36 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత నాగ చైతన్యతో విడాకుల అనంతరం ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తుంది. వీరు విడిపోయి దాదాపు పది నెలలు కావొస్తున్నా ఇంకా వీరి బ్రేకప్‌ న్యూస్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారన్నదానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్‌ పరంగానూ దూసుకెళ్తున్నారు.

లాల్‌ సింగ్‌ చద్దా సినిమాతో చై బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండగా, సమంత సైతం హిందీలో వరుస సినిమాలకు సైన్‌ చేస్తుంది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించిన సమంత ఫోటోలు ఒక్కసారిగా వైరల్‌ అయ్యాయి.

లూయిస్ హే రాసిన 'యూ కెన్  హీల్ యువర్  లైఫ్'అనే బుక్‌ సామ్‌ చేతిలో కనిపించేసరికి సామ్‌ డిప్రెషన్‌లో ఉందని, చై జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ఇలాంటి పుస్తకాలు చదువుతుందని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక కెరీర్‌ విషయానికి వస్తే ప్రస్తుతం సామ్‌ ఖుషీ, యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తుంది. 

మరిన్ని వార్తలు