కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన స‌మంత

5 Sep, 2020 16:26 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : సినిమా రంగంలో టాప్ హీరోయిన్‌గా త‌న స‌త్తా చాటుకున్న అక్కినేని వారి కోడ‌లు, హీరోయిన్‌ స‌మంత ఇటీవ‌ల కొత్త  రంగంలోకి అడుగుపెట్టారు. స్టార్ హీరోయిన్‌గా ఉన్న‌ స‌మంత బ‌ట్ట‌ల వ్యాపారాన్ని మొద‌లు పెట్టి బిజినెస్ ఉమెన్‌గా మార‌బోతున్నారు. 'సాకీ వరల్డ్' పేరుతో యువ‌త‌ను ఆక‌ట్టుకునే విధంగా దుస్తుల‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన కొత్త ఔట్ లేట్ ను త్వరలో ప్రారంభించనున్నట్లుగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. " దీని గురించి నేను కొన్ని నెలలుగా కల కంటున్నాను. ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఇది నా ప్యాషన్ పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. సాకీ వరల్డ్‌లో ధరలు సామాన్యులకి అందుబాటులో ఉంటాయి. మీరందరూ దీన్నీ ఇష్టపడుతారు" అని సామ్ ట్వీటర్‌లో పేర్కొన్నారు. (అది చూసి ఏడ్చేశాను: సమంత)‌

ప్ర‌స్తుతం స‌మంత తెలుగు, త‌మిళ సినిమాల‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ సెకండ్ సీజన్‌లో సమంత నటిస్తోన్న సంగతి తెలిసిందే.  టెర్రరిస్టుగా నెగటివ్ టచ్ తో కూడిన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా బిజినెస్‌పై  తన దృష్టి పెట్టిన సామ్ ఇప్పటికే ఏకమ్ అనే చిన్న పిల్ల‌ల స్కూల్ కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు మరో బిజినెస్ కూడా షురూ చేశారు. మ‌రి ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు వారి కోడలు త్వ‌ర‌లో ప్రారంభించ‌బోయే బ‌ట్ట‌ల వ్యాపారాన్ని ఎంత వ‌ర‌కు ముందుకు తీసుకువెళ్తారో వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా