ChaySam Divorce: చై-సామ్‌ విడిపోవడానికి గల కారణాన్ని ఆమె స్టైలిష్ట్‌ ఇలా బయట పెట్టాడా?

5 Oct, 2021 21:50 IST|Sakshi

Naga Chaitanya And Samntha Divorce Reasons: టాలీవుడ్‌ మోస్ట్‌ క్యూట్‌ కపుల్‌ సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కి గురిచేసింది.  ఇలాంటి వార్త ఒకటి వినాల్సి వస్తుందని అక్కినేని అభిమానులు అస్సలు ఊహించి ఉండరు. కొన్ని రోజులుగా వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్నా అవి రూమర్స్‌గానే మిగిలిపోతాయని అభిమానులు భావించారు. కానీ చివరకు ఆ వార్తలనే నిజం చేస్తూ తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు నాగ చైతన్య-సమంత.

చదవండి: నెటిజన్ల ట్రోల్స్‌: చై-సామ్‌ విడాకులకు కారణం ఇతడేనా!?

ఈ క్రమంలో వారి విడిపోవడానికి కారణాలేంటని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. ఇందులో సమంత కొంతకాలం షేర్‌ చేస్తున్న గ్లామర్‌ ఫొటోలు, ప్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌, సూపర్‌ డీలక్స్‌ల సినిమాల్లో ఆమె నటించిన బోల్డ్‌ సీన్స్‌ ప్రధాన కారణం అంటున్నారు. జీవితాన్నే ప్రభావం చేసే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనకా ఇంకా ఏదైనా బలమైన కారణాలు బయటకు వస్తాయోమో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో సమంత పర్సనల్‌ స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ చేసిన పోస్టులు చర్చనీయాంశం మారాయి.

వీరి విడాకులు ప్రకటన అనంతరం అతడు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలు చర్చకు దారి తీశాయి. అంతేగాక వెంటనే వాటిని డిలీట్‌ చేయడంతో ఇవి కాస్తా వార్తల్లో నిలిచాయి. పేర్లు ప్రస్తావించకపోయినా.. సమంతకు ఏదో అన్యాయం జరిగిందన్నట్లుగా అతడి డిలీటెడ్‌ పోస్టులు సూచించాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రీతమ్ జుకల్కర్ తొలగించిన ఓ పోస్టు చై-సామ్ విడాకులకు అసలు కారణాన్ని వెల్లడించాడా? అని అందరూ ఇప్పుడు చర్చించుకుంఉటన్నారు. సమంత మానసిక ఒత్తిడి, వేధింపుల కారణంగానే విడాకులకు దారి తీసిందా అనే అనుమానాలు తలెత్తెలా అతవి డిలీటెడ్‌ పోస్ట్‌ ఉంది. 

చదవండి: సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్‌ వైరల్‌

అలాగే ‘సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్లకు ప్రస్తుతం ట్రోలింగ్‌ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది’ అంటూ పోస్ట్‌ చేసిన జుకల్కర్‌.. కొన్ని నిమిషాల్లోనే దానిని డిలీట్‌ చేసేశారు. మరి ఇవి ఎవరిని ఉద్దేశించి జుకల్కర్ చేశాడో తెలియదు గానీ.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు చై-సామ్‌ విడిపోవడానికి ఇతడే కారణమంటూ పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అతడిని వేధిస్తుంటే.. సైబర్ క్రైం పోలీసులను ట్యాగ్ చేస్తూ జుకల్కర్ వారి అకౌంట్లకు సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు