ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్‌ చెప్పిన సామ్‌.. వైరల్‌

20 Sep, 2021 11:08 IST|Sakshi

సమంత పెళ్లి తర్వాత మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఆమె తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అక్కినేని కోడలు ‘శాకుంతలం’ మూవీని కంప్లీట్‌ చేసి, విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తారలతో కలిసి విఘ్నేష్ శివ‌న్‌ దర్శకత్వంలో ‘కాతు వాకుల్ రెండు కాదల్’ చిత్రంలో నటిస్తోంది.

ఇటీవల ఈ చిత్రం నుంచి టు టు టు మ్యూజికల్ వీడియో విడుదలై యూట్యూబ్‌లో ట్రేండింగ్‌లో ఉంది. తాజాగా ఈ పాటను చూసిన ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎంతో ఇప్రెస్‌ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. సాంగ్‌ ఎంతో బావుందని, మూవీ టీంకి కంగ్రాట్స్‌ తెలిపింది. అంతేకాకుండా దర్శకుడు విఘ్నేష్‌కి పుట్టిన రోజు విషెస్‌ చెప్పింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఈ పోస్ట్‌ని చూసి.. మీ మాటలు మా మూవీ టీంకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పి, ప్రియాంక చోప్రాకి  థ్యాంక్స్‌ చెప్పింది. కాగా విఘ్నేష్ శివన్, నయన తార, లలిత్ కుమార్ సంయుక్తంగా ‘కాతు వాకుల్ రెండు కాదల్’ సినిమాని నిర్మిస్తున్నారు.

చదవండి: ‘లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అంటున్న ప్రియాంక చోప్రా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు