సమంతకు బంపర్‌ ఆఫర్‌ : నయారోల్‌లో

1 Jan, 2021 18:59 IST|Sakshi

'ఏమాయ చేశావే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత.. నేడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. మూడేళ్ల క్రితం అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టిన ఈ భామ.. ప్రస్తుతం చేతి నిండా పనులతో బిజీగా ఉన్నారు. సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌లు, బిజినెస్‌లతో ముందుకు సాగుతున్నారు. దీనికి తోడు సమయం చిక్కినప్పుడల్లా కుటుంబం, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ప్రస్తుతం కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా భర్త చైతన్య, స్నేహితులతో కలిసి గోవాలో ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా సమంత నుంచి ఓ తాజా అప్‌డేట్‌ వచ్చింది. చదవండి: అప్పటివరకూ మేం స్నేహితులమే: సమంత

సంచలన దర్శకుడు గుణశేఖర్  ఆప కమింగ్‌ యూవీలో  సమంత  బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారు.  ఆయన తెరకెక్కించనున్న భారీ చిత్రం శాకుంతలంలో సమంత మెయిన్‌ లీడ్‌లో(శకుంతల) నటించనుందని అధికారిక ప్రకటన వచ్చింది.  ఈ నేపథ్యంలో శాకుంతలం.. కావ్యనాయకి గా సమంత నటించనుందని శుక్రవారం గుణశేఖర్‌ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.  దీనిపై సమంత కూడా ట్విటర్‌ ద్వారా సంతోషం ప్రకటించారు.

విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సమంత మొదటిసారి పౌరాణిక పాత్రలో అలరించనున్నారు. ఇక ఈ 'శాకుంతలం' సినిమాను జనవరిలో ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని గుణశేఖర్‌ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా సమంత ఈ సినిమాలో నటించనుందనే విషయం తెలిసిన వెంటనే సామ్‌ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.   అయితే దుష్యంత మహారాజుగా ఎవరు కనిపిస్తారు? అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

మరిన్ని వార్తలు