Samantha Yashoda Trailer: సమంత యశోద ట్రైలర్.. పాన్ ఇండియా స్టార్స్‌తో రిలీజ్

26 Oct, 2022 18:13 IST|Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ  అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. 

(చదవండి: యశోద టీజర్‌: ప్రెగ్నెంట్‌ లేడీగా సమంత నటనకు వావ్‌ అనాల్సిందే!)

ఈనెల 27న పాన్ ఇండియా హీరోలతో ట్రైలర్ రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేసింది. దీంతో అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలుగులో హీరో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ 'యశోద' ట్రైలర్ విడుదల చేయనున్నారు.

నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. 

మరిన్ని వార్తలు