Sambhavna Seth: అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్‌ ఎఫెక్ట్స్‌

27 Jul, 2022 15:01 IST|Sakshi

అమ్మ అని పిలిపించుకోవాలని ఏ మహిళకు ఉండదు. కానీ గర్భధారణ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఐవీఎఫ్‌, సరోగసీ పద్ధతుల ద్వారా పిల్లలను కనాలని ఆలోచిస్తారు. బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సంభావన సైతం ఇన్‌వెట్రో ఫెర్టిలైజేషన్‌(ఐవీఎఫ్‌)ను ఆశ్రయించింది. కానీ ఈ ఆధునిక పద్ధతి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడుతోంది. తాజాగా మరోసారి ర్యూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో సతమతమవుతున్నానంటోంది. తన బాధను అభిమానులతో పంచుకుంటూ కంటతడి పెట్టుకుంది.

'పిల్లలను కనాలని ఐవీఎఫ్‌ పద్ధతిని ఎంచుకున్నాం. కానీ దీనివల్ల కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నాను. చల్లగా ఉండే ప్రదేశంలో ఎక్కువ సేపు ఉంటే చాలు కాళ్లు, చేతులు మొద్దుబారిపోతున్నాయి. తర్వాత వాపు లేదంటే నొప్పి వస్తోంది. కొన్నిసార్లు నన్ను చూస్తే నాకే కోపమొస్తోంది. అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మంచి జరగబోతుందనుకునేలోపు ఏదో ఒక చెడు జరుగుతుంది.

నా వల్ల నా భర్త అవినాష్‌ కూడా బాధపడుతున్నాడు. ఈ సమస్యలతో నిత్యం పోరాడుతూ ఉండటం నరకంగా ఉంది. కొందరేమో నేను లావయ్యానని ట్రోల్‌ చేస్తున్నారు. అవును, నేను నాలుగోసారి ఐవీఎఫ్‌ పద్ధతి ప్రయత్నించగా అది ఫెయిల్‌ అయింది. అందువల్లే ఇలా బరువు పెరిగాను' అని చెప్పుకొచ్చింది సంభావన. అటు ఆమె భర్త అవినాష్‌ సైతం ఇలాంటి వైద్య విధానాలు అంత సులువుగా ఏమీ ఉండవన్నాడు. దీనివల్ల శరీరంలో హార్మోన్స్‌ అదుపు తప్పుతాయని, అంతమాత్రానికే తన భార్యను నోటికొచ్చినట్లు అంటే బాగోదని హెచ్చరించాడు.

A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial)

A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial)

చదవండి: అమ్మ హాస్పిటల్‌లో ఉందంటే కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు
ధనుష్‌తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

మరిన్ని వార్తలు