Sameera Reddy: గ్లామర్ కోసం అలాంటి సర్జరీలు చేయించుకునేవారు: సమీర

30 Jan, 2023 18:55 IST|Sakshi

సమీరా రెడ్డి అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు పరిచయం లేకపోవచ్చు. కానీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది భామ. అంతకుముందే బాలీవుడ్‌ ఆరంగ్రేటం చేసింది సమీర.  ఆ తర్వాత  చిరంజీవి సరసన జై చిరంజీవ, ఎన్టీఆర్‌తో అశోక్, రానా మూవీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది ముంబయి ముద్దుగుమ్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమీర పలు ఆసక్తికర వ్యాఖ్యలు  చేసింది. 

గతంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది సమీరా రెడ్డి. అప్పట్లో చిత్ర పరిశ్రమలో నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ గ్లామర్ కోసం శస్త్రచికిత్సలు చేసుకునేవారని తెలిపింది. కానీ నేను మాత్రం అలాంటి వాటికి జోలికి వెళ్లలేదని అన్నారు.  నేను ఇండస్ట్రీలో ప్రవేశించాక దాదాపు 10 ఏళ్ల క్రితం ముక్కుతో పాటు చెస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేవారని పేర్కొంది. తనను కూడా చేయించుకోవాలని సలహా ఇచ్చారని.. కానీ నేను అలాంటి వాటిని పట్టించుకోలేదని తెలిపారు. కానీ ఇదంతా వారి వ్యక్తిగత నిర్ణయమని.. వారికి ఇష్టంతోనే చేసేవారని వెల్లడించింది.  

సమీర వెండితెరకు దూరమయ్యాక 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. ఈ జంటకు  కొడుకు హన్స్ (7), కుమార్తె నైరా (2)ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది భామ. 


 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు