‘అమ్మాయంటే చాలు.. పెళ్లయ్యేవరకూ అదే ప్రశ్న’

4 Mar, 2021 09:23 IST|Sakshi

‘‘తల్లయిన తర్వాత ఎవరైనా బరువు పెరుగుతారు. ఆ బరువుని అసహ్యించుకోవడం మంచిది కాదు. అలానే ‘ఏంటీ లావయ్యారు?’ అని ఎవరైనా అడిగితే ఆత్మన్యూనతాభావానికి గురి కాకూడదు. మన శరీరం.. మనిష్టం. మనం ఎలా ఉన్నామో అలానే మనల్ని మనం అంగీకరించాలి’’ అని ఆ మధ్య ఓ పాపకి జన్మనిచ్చిన సందర్భంలో అన్నారు సమీరా రెడ్డి. తాజాగా పెళ్లి గురించి ఓ విషయం పంచుకున్నారు. సమీరా మాట్లాడుతూ – ‘‘నా పెళ్లికి ముందు వరకూ ‘ఏంటీ ఇంకా పెళ్లవ్వలేదా’ అనే ప్రశ్న పదే పదే నాకు ఎదురయ్యేది. ‘35 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లవ్వకపోవడం ఏంటి’ అనేవారు.

అది వినగానే నాలో తెలియని ఒత్తిడి పెరిగేది. అమ్మాయంటే చాలు.. పెళ్లయ్యేవరకూ అదే ప్రశ్న. పెళ్లయ్యాక ‘పిల్లలెప్పుడు’? అనే ప్రశ్న. అమ్మాయికి ఓ తోడు ఉండాలని సమాజం అంటుంది. పెళ్లి, పిల్లలు ఉంటేనే ఆ అమ్మాయి జీవితం పరిపూర్ణం అవుతుందని అంటారు. ఇంకో విషయం ఏంటంటే.. మొదటి బిడ్డ పుట్టాక.. ఇంకో బిడ్డను ప్లాన్‌ చేస్తున్నారా? లేక ఒక్కరే చాలా? అని ఓ ప్రశ్న. ఈ ప్రశ్నలు ఎదుర్కోలేక చాలామంది అమ్మాయిలు భయాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వాళ్లకేం కావాలో ఆ నిర్ణయాలే తీసుకుంటారు. భయంతో కాదు... ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారు’’ అన్నారు. 2014లో అక్షయ్‌ వార్దేని పెళ్లాడారు సమీరా. అప్పుడు ఆమెకు 36ఏళ్లు. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అక్షయ్‌ అర్థం చేసుకునే భర్త అని పలు సందర్భాల్లో సమీరా పేర్కొన్నారు. 

చదవండి:
24 ఏళ్లు.. కానీ 23వ బర్త్‌డే చేసుకుంటా : హీరోయిన్‌

తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌పై ఐటీ గురి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు