సంపూ బర్త్‌డే: క్యాలీఫ్లవర్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

10 May, 2021 00:26 IST|Sakshi

సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’. ‘శీలో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ . గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్‌, రాధాకృష్ణా టాకీస్‌పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది.

మే 9 సంపూర్ణేష్‌ బర్త్‌ డేకి ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తిగా సంపూ లుక్‌ అదిరిపోయింది. సంపూ స్టైల్‌ కామెడీతో సినిమా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: దీప్‌ ప్రజ్వల్‌ క్రిష్, కెమెరా: ముజీర్‌ మాలిక్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి.

మరిన్ని వార్తలు