ఓటీటీలోకి సంపూర్ణేష్‌ బాబు ‘క్యాలీ ఫ్లవర్‌’

6 Apr, 2022 12:59 IST|Sakshi

Cauliflower Movie OTT Release Date: బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు హీరోగా ఆర్కే మలినేని తెరకెక్కించిన తాజా చిత్రం తాజా చిత్రం ‘క్యాలీ ఫ్లవర్‌’ .‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం గతేడాది నవంబరు 26న థియేటర్స్ లో విడుదలై  మిశ్రమ స్పందనను దక్కించుకుంది. సంపూ కామెడీ అందరిని ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. ఏప్రిల్‌ 9 నుంచి  అమెజాన్ ప్రైమ్ వీడియో ,హంగామా మొదలగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ లో స్ట్రీమింగ్  కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతలు ఆశా జ్యోతి, శ్రీరామ్ లు మాట్లాడుతూ.. థియేటర్స్‌లో మిస్సైయిన ప్రేక్షకులందరూ ఈ నెల 9న ఓటీటీలో ‘క్యాలీఫ్లవర్’ చిత్రాన్ని వీక్షించాలని కోరారు.  

దర్శకుడు ఆర్కే మలినేని మాట్లాడుతూ.. శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ ను ఈ సినిమాలో చెప్పడం జరిగింది.నవంబర్ 26న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో  విడుదల చేయడం జరిగింది.ఎన్నో సీరియల్స్ తీసిన నన్ను చాలా మంది ఇన్ని సీరియల్స్ చేస్తున్న నువ్వు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలను ఎందుకు తీయలేవు అన్నదానికి సమాధానమే ఈ క్యాలీఫ్లవర్‌.మేము చేసిన మంచి ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలని  మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు

మరిన్ని వార్తలు