‘క్యాలీఫ్లవర్‌’ షూటింగ్‌కు రెడీ అయిన సంపూ

14 Jun, 2021 00:32 IST|Sakshi
సంపూర్ణేష్‌ బాబు

‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాల ఫేమ్‌ సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్‌ గా నటిస్తున్నారు. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్‌, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశాజ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌కి కొంచెం విరామం ఇచ్చిన చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుపెట్టింది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి, కథ: గోపీ కిరణ్, సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్, కెమెరా: ముజీర్‌ మాలిక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు