శ్రీరాముని అవతారంలో సంపూర్ణేష్‌ బాబు

26 Jun, 2021 09:42 IST|Sakshi

‘హృదయకాలే యం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాల ఫేమ్‌ సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’కి గుమ్మడికాయ కొట్టారు. ఆర్కే మలినేని దర్శకత్వంలో సంపూర్ణేష్, వాసంతి జంటగా నటించిన చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సినిమాలో శ్రీరాముడు వేషధారణలో ఉన్న సంపూర్ణేష్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘ఇంగ్లాండ్‌ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లిష్‌ వ్యక్తిగా సంపూ కనిపిస్తారు. గోపీ కిరణ్‌ చక్కని కథ అందించారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు