Samuthirakani: 'మాచర్ల నియోజకవర్గం' నటుడిగా సంతృప్తినిచ్చింది

11 Aug, 2022 11:07 IST|Sakshi

మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేరట్స్‌కి వస్తారు. రీసెంట్‌గా 'సీతారామం', 'బింబిసార' చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ఈ సక్సెస్‌ను మాచర్ల నియోజకవర్గం కొనసాగిస్తుందని నమ్ముతున్నాను అన్నారు దర్శక, రచయిత-నటుడు సముద్ర ఖని. నితిన్‌, కృతిశెట్టి జంటగా ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'.

సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర  చేసిన సముద్ర ఖని మాట్లాడుతూ.. ''ఇందులో రాజప్ప అనే పాత్ర చేశాను. నటనకు మంచి ఆస్కారం ఉండటంతో సవాల్‌గా తీసుకొని నటించాను. ఈ చిత్రకథ తరమాలోనే తమిళనాడులోని ఓ ప్రాంతంలో 25 ఏళ్లు ఎలక్షన్స్‌ జరగలేదు. చివరికి ఉదయ్‌శంకర్‌ అనే ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ చొరవ తీసుకుని స్థానికులతో మాట్లాడి ఎలక్షన్స్‌ జరిగేలా చేశారు.

ఈ అంశాన్ని రాజశేఖర్‌తో షేర్‌ చేసుకున్నాను అన్నారు. ఇంకా మాట్లాడుతూ రచన అంటే నాకు ప్రాణం. లొకేషన్‌లో ఖాళీ సమయం దొరికినప్పుడు కథలు రాస్తుంటాను. ప్రస్తుతం చిరంజీవిగారి గాడ్‌ఫాదర్‌, నానీ దసరా సినిమాల్లో నటిస్తున్నాను'' అన్నారు. 

మరిన్ని వార్తలు