క్షమాపణలు అంగీకరిస్తున్నా: నటి

8 Sep, 2020 11:34 IST|Sakshi

బెంగుళూరు: కర్ణాటకలో నటి సంయుక్త హెగ్డే, కాంగ్రెస్‌ నేత కవిత రెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కవిత రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పార్క్‌లో స్పోర్ట్స్‌వేర్‌ ధరించి సంయుక్త, ఆమె స్నేహితురాలు వ్యాయమం చేస్తుండగా అటుగా వెళ్లిన కాంగ్రెస్‌ నేత కవిత రెడ్డి వారిని వీడియో తీసి వారిపై దాడి చేశారు. 

ఈ వీడియోను నటి సంయుక్త హెగ్డే ఆమె సోషల్‌మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసి ‘మహిళలు ఏం ధరిస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనే కారణాలతో వారిని హింసించడం సమాజం ఆపాలి’ అని ఆమె ట్వీట్‌ చేశారు. అదేవిధంగా కవిత మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిగివచ్చిన కవిత సంయుక్తకు క్షమాపణలు చెప్పింది. తాను అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదని పేర్కొంది. ఇదిలా వుండగా కవిత క్షమాపణలను అంగీకరిస్తున్నట్లు సంయుక్త తెలిపింది. ఇదంతా మరిచిపోయి ముందుకు సాగుదామని కోరింది. ప్రతి చోట మహిళలకు భద్రత ఉండాలి తాను కోరుకుంటున్నట్లు పేర్కొంది. 

చదవండి: 'కిరాక్ పార్టీ' హీరోయిన్‌పై మూక దాడి
 

మరిన్ని వార్తలు