ప్లీజ్‌.. సాయం చేయండి: హీరోయిన్‌ మొర

2 May, 2021 12:16 IST|Sakshi

బెంగళూరు: కన్నడ హీరోయిన్‌ సంయుక్త హెగ్డే తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. అయితే తన తండ్రి ఆరోగ్యం ఏమీ బాగోలేదని ఆందోళన చెందుతోందీ హీరోయిన్‌. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. "నా తల్లిదండ్రులకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. నా తండ్రికి రెమిడెసివిర్‌ టీకా అత్యంత అవసరం. ఇప్పుడాయనకు ఆరు ఇంజక్షన్లు అవసరం. దానికోసం ఎంతోమందిని సంప్రదించాను కానీ దొరకడం లేదు. ప్రస్తుతానికైతే నా తండ్రిని బెంగళూరులోని స్వగృహంలో ఉంచి చూసుకుంటున్నాం. ఆస్పత్రికి వెళ్లడానికి ఆయన నిరాకరిస్తున్నారు. వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది."

"ఆ ఇంజక్షన్లను ఇంటికి తెచ్చిచ్చేవాళ్లు ఎవరైనా మీకు తెలిస్తే వెంటనే నాకు మెసేజ్‌ చేయండి. నేను ప్రయత్నించిన ఫోన్‌ నెంబర్లు అన్నీ స్విచాఫ్‌ అని వస్తున్నాయి. దయచేసి నాకు సాయం చేసి నా తల్లిదండ్రులను కాపాడండి. ప్లీజ్‌.." అని వేడుకుంది. కాగా సంయుక్త హెగ్డే కోమలి, వాచ్‌మ్యాన్‌, పప్పీ వంటి పలు తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో కిరాక్‌ పార్టీలో యంగ్‌ హీరో నిఖిల్‌ సరసన తళుక్కున మెరిసింది.

చదవండి: నటుడికి సీరియస్‌.. 2 నెలల బిడ్డను ఒంటరిగా వదిలి వెళ్లిన భార్య

మనుషులకు మనుషులే సహాయం చేసుకోవాలి: ప్రగ్యా జైస్వాల్‌

మరిన్ని వార్తలు