‘కత్తి’ హీరోయిన్‌ మరోసారి వార్తల్లోకి, అటు భర్తతో మాల్దీవుల్లో హల్‌చల్‌

16 Aug, 2021 20:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కత్తి మూవీ హీరోయిన్‌, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ స‌నాఖాన్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. పాఠశాల స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సనాఖాన్‌ ఈ వేడుకలను సంబంధించిన  వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త,  భర్త ముఫ్తీ అనాస్ సయ్యద్‌తో కలిసి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను సనాఖాన్‌ పోస్ట్‌ చేసింది. అలాగే భర్తతో మాల్దీవుల్లో గడిపిన అద్భుతమైన క్షణాలను, ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. 

75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఆమె ఆ తరువాత విద్యార్థులనుద్దేశించి మాట్లాడింది. అయితే ఆ తరువాత వారిద్దరూ వెళుతుండగా, విద్యార్థులంతా  చుట్టు ముట్టి హడావిడి చేశారు. ‘సనా..సనా’ అటూ పెద్దగా అరుస్తూ సందడి చేశారు. దీంతో పోలీసులు, బాడీగార్డులు వారికి రక్షణగా ఏర్పడ్డారు. దేవుడా.. ఈ ప్రేమ ఎప్పటికీ ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నా నంటూ ఆ వీడియోను షేర్‌ చేసింది. మరోవైపు భర్త అనాస్‌తో సనా ఇటీవల మాల్దీవుల్లో హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేసింది. అక్కడి బీచ్‌,  వాటర్ విల్లా, పూల్‌లో సరదాగా గడపింది. పూల్ ఫ్లోటీపై స్వారీ చేస్తూ దాదాపు నీటిలో పడిపోవడం, రియాల్టీ, ఎక్స్‌పెక్టేషన్‌ అంటూ ఊయలను గట్టిగా ఊపుతూ భర్త తనను భయపెట్టి, నవ్వించిన  ఫన్నీ వీడియోను కూడా అభిమానులతో షేర్‌ చేసింది. 

కాగా సినిమా లైఫ్ స్టయిల్‌కు పూర్తిగా దూరం కావాలని భావిస్తున్నానంటూ గత ఏడాది అక్టోబర్‌లో ప్రకటించి అభిమానులకు షాక్‌ ఇచ్చింది. ఆ సృష్టికర్త ఆదేశాలకు నటను స్వస్తి పలికి మానవాళికి సేవ చేయాలని భావిస్తున్నానని ప్రకటించింది.  ఆ తరువాత  అనాస్‌ని వివాహమాడి మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. సనాఖాన్‌ ఖత్రోన్ కే ఖిలాడీ, హల్లా బోల్, జై హో,ఏక్ ప్రేమ్ కథ వంటి చిత్రాలతోపాటు,  టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం కత్తి మూవీలో  హీరోయిన్‌గా నటించింది.  'గగనం', 'మిస్టర్ నూకయ్య' సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు