పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. మోసం చేశాడు

6 Oct, 2020 07:25 IST|Sakshi
సనంశెట్టి, దర్శిన్‌

చెన్నై: నటి సనంశెట్టి ఫిర్యాదు మేరకు బిగ్‌ బాస్‌ దర్శిన్‌పై పోలీసులు కేసును నమోదు చేశారు. తమిళ, తెలుగు భాషల్లో కథానాయికగా నటిస్తున్న సనంశెట్టి, నటుడు దర్శిన్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ తర్వాత ఆమెను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై నటి సనంశెట్టి ఆ మధ్య స్థానిక ఆడయారు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో దర్శిన్‌ పై ఫిర్యాదు చేసింది.  (ఎమ్మెల్యే ప్రేమ వివాహం) 

నటుడు దర్శిన్, తాను ప్రేమించుకున్నామని..పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఏడాది పాటు కలిసి తిరిగామని తెలిపింది. అయితే ఉన్నఫలంగా దర్శిన్‌ తనతో మాట్లాడడం మానేశాడని, తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని చెప్పింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. కాగా ఆమె ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపిన దర్శిన్‌ పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శిన్‌ పై కేసు నమోదు చేశారు. దర్శిన్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.   (ఒక ఫొటో ఆ ఎంపీకి నిద్ర లేకుండా చేస్తోంది!)

మరిన్ని వార్తలు