డ్రగ్స్‌ కేసు: ప్రముఖుల జాబితా సిద్ధం

19 Sep, 2020 06:53 IST|Sakshi

తాజాగా క్లబ్, పబ్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డుల నుంచి వివరాలు సేకరణ 

సంజన బెయిల్‌ నేటికి వాయిదా

శాండల్‌ వుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ వేగవంతం 

యశవంతపుర: శాండిల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ వేగవంతం చేసిన సీసీబీ పోలీసులు ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. తాజాగా సీసీబీ పోలీసులు పబ్‌లు, క్లబ్‌లకు వచ్చే ప్రముఖుల జాబితాను సిద్ధం చేశారు. రేవ్‌ పార్టీలను నిర్వహిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడి సిబ్బంది, మేనేజర్, సెక్యూరిటీ గార్డుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. పబ్‌ల్లో ఎన్ని గంటల వరకు పారీ్టలను నిర్వహిస్తున్నారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ఎవరెవరు వచ్చేవారని ఆరా తీస్తున్నారు. (చదవండి: శాంపిల్స్‌లో చీటింగ్‌ చేసిన నటి రాగిణి ద్వివేదీ)

యాంకర్‌తో పాటు ముగ్గురికి నోటీసులు 
డ్రగ్స్‌ దందా కేసులో సీసీబీ పోలీసులు నటుడు, యాంకర్‌ అకుల్‌ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే ఆర్‌వీ దేవరాజ్‌ మగ ఆర్‌ వీ.యువరాజ్, నటుడు సంతోషకుమార్‌లకు నోటీసులిచ్చారు. శనివారం 10 గంటలకు సీసీబీ కార్యాలయానికి హాజరు కావాలని సూచించినట్లు జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. తాను హైదరాబాద్‌లో ఉన్నా విచారణకు హాజరవుతున్నట్లు యాంకర్‌ అకుల్‌ బాలాజీ తెలిపారు. నటుడు దిగంత్, ఆయన భార్య ఐంద్రితా రైలకు మళ్లీ సీసీబీ నోటీసులిచ్చి విచారణ చేసింది. మరోసారి నోటీసులిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

సంజనా బెయిల్‌ పిటిషన్‌ విచారణ నేటికి వాయిదా
డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌యిన నటి సంజన బెయిల్‌ పిటిషన్‌ను ఇక్కడి ఎన్‌డీపీఎస్‌ సెషన్స్‌ కోర్టు విచారణ శనివారానికి వాయిదా వేసింది. బెంగళూరు 1వ ఏసీఏఎం కోర్టులోనూ బెయిల్‌ కోసం దరఖాస్తు చేయగా రెండు రోజులకు వాయిదా వేసింది. దీంతో రెండు కోర్టుల్లోనూ ఆమెకు నిరాశ ఎదురైంది. బెయిల్‌ దొరికే వరకు సంజన జైలులో ఉండక తప్పదు.  ఇక తప్పించుకు తిరుగుతున్న శివప్రకాశ్, ఆదిత్య ఆళ్వ, షేఖ్‌ ఫాజిల్‌ కోసం సీసీబీ  బృందాలు గాలింపు చేపడుతున్నాయి.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు