డ్రగ్స్‌ కేసు: సెక్స్‌ రాకెట్ కోసం‌ ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు

30 Sep, 2020 07:51 IST|Sakshi

నటీమణుల ఫోన్లలో ఫోటోలు, వీడియోలు! 

అందుకు ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌  

సీసీబీ విచారణలో బహిర్గతం 

యశవంతపుర: శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసు రోజురోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో తవ్వేకొద్దీ కొత్త నిజాలు బయటపడుతున్నాయి. ఈ బాగోతంలో అరెస్టయి పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల మొబైల్‌ఫోన్ల నుంచి సీసీబీ అధికారులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఇద్దరి మొబైల్‌ఫోన్లలో సెక్స్‌ రాకెట్‌ బయటపడినట్లు సీసీబీ వర్గాల కథనం. వారి మొబైళ్లలో నీలి వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు కొందరు సీసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో డ్రగ్స్‌ కథలో మరో మరో దందా వెలుగుచూసినట్లయింది. నీలి స్కాంతో సంబంధమున్నవారందరికీ నోటీసులిచ్చి విచారణ చేయాలని నిర్ణయించారు. ఇద్దరి మొబైల్‌ ఫోన్లలో నీలి దందా కోసం ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపు ఉందని, డ్రగ్స్‌ కేసు బయటపడగానే ఆ గ్రూపును డిలిట్‌ చేశారని సీసీబీ కథనం.  
  
మరో ఇద్దరు అరెస్ట్‌  
మత్తు బాగోతంలో మంగళూరు పోలీసులు ఇద్దరు నిందితులను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. కెంగేరికి చెందిన ఒకరు, నైజీరియాకు చెందిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి మంగళూరుకు తరలించారు. మంగళూరుకు చెందిన సీసీబీ బృందం వీరిని పట్టుకొంది. వీరు ముంబై, గోవాల నుంచి డ్రగ్స్‌ను తెచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న డ్యాన్సర్‌ కిశోర్‌ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.   (3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?)

మరికొందరి విచారణ  
పరప్పన అగ్రహార జైల్లో ఉన్న నటి రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగా సీసీబీ పోలీసులు మూడు రోజుల నుండి కొందరిని ఆఫీసుకు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. రాగిణి సన్నిహితులిద్దరిని చామరాజపేటలోని సీసీబీ ఆఫీసులో విచారించారు. వీరిద్దరూ డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. మాఫియా డాన్‌తో సంబంధాలున్న ఒక యువకున్ని సీసీబీ అదుపులోకి తీసుకొని విచారించింది. ఇటీవల సస్పెండయిన ఒక ఏసీపీతో ఇతనికి సంబంధాలున్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు