వారికి అండర్‌వరల్డ్‌ డాన్‌లతో సంబంధాలు..!

5 Oct, 2020 06:23 IST|Sakshi

రాగిణి, సంజనకు ముగిసిన ఈడీ విచారణ  

సాక్షి, బెంగళూరు : శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో కోర్టు అనుమతితో నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిలను పరప్పన జైలులో ఐదు రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆదివారం ముగించారు. సినిమాల ద్వారా ఎంతెంత సంపాదించారనే వివరాలను సేకరించారు. రాగిణి తండ్రి రిటైర్డు మిలిటరీ అధికారి కాగా, ఆయన పలు వివరాలను ఈడీకి అందజేశారు.   

రాగిణిపై అధిక అనుమానాలు  
 మరో నటి సంజన విచారణలో అనేకసార్లు ఆవేదనతో విలపించినట్లు తెలిసింది. ఎన్ని సినిమాలు నటించారు. ఎంత డబ్బులు సంపాదించారు. పిత్రార్జితం ఎంత?, ఇటీవల కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఏమిటి అని ఈడీ అధికారులు సంజనపై ప్రశ్నలవర్షం కురిపించారు. పలు భాషల్లో 42 సినిమాలలో నటించిన సంజన సినిమా రంగంలో పెద్ద పేరును సంపాదించలేకపోయినా ఆదాయానికి మాత్రం ఢోకా లేదని గుర్తించారు. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో సమాచారం కోసం ఈడీ ఇప్పటికే ఐటీశాఖకు లేఖ రాసింది. రాగిణి, సంజన ఆస్తులు, వారి సంపాదన తీరుపై ఈడీ అవగాహనకు వచ్చింది. సంజన బెయిల్‌ దొరికి బయటకు వచ్చినప్పటికీ విచారణ కోసం మళ్లీ అదుపులోకి తీసుకువాలని ఈడీ భావిస్తోంది.   (అనుశ్రీకి అండగా మాజీ సీఎం.. ఎవరా గాడ్‌ఫాదర్‌ ?)

బెయిల్‌ కోసం ఆరాటం   
రాగిణి, సంజనల విచారణలో పలు ముఖ్యమైన అంశాలను సీసీబీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా మరికొన్ని రోజులు ఇద్దరినీ ప్రశ్నించాలని నిర్ణయించారు. సీసీబీ విచారణలో రౌడీలు, అండర్‌వరల్డ్‌ డాన్‌లతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. బెంగళూరులో వారికి సహకారం అందించిన కొందరు రౌడీలపై నిఘా పెట్టారు. ఇక హైకోర్టులో బెయిలు కోసం నటీమణులు లాయర్లను సంప్రదిస్తున్నారు.  (డ్రగ్స్‌ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!)

ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్ల అరెస్ట్‌ 
డాలర్స్‌ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో గంజాయి సేవిస్తున్న వరుణ్, వినోద్‌ అనే డ్రగ్‌ పెడ్లర్లను బెంగళూరు సంజయ్‌నగర పోలీసులు  ఆదివారం అరెస్ట్‌ చేశారు. వారిని విచారించగా బెంగళూరులో జరిగే పార్టీలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారని తెలిసింది.  

మరిన్ని వార్తలు