‘‘గంధర్వ’’ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్టర్‌ విడుదల

15 Aug, 2021 20:57 IST|Sakshi

వంగవీటి, 'జార్జిరెడ్డి' ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గంధర్వ. గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ కథనాయికలు. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వర్ స్క్రీన్స్ ప‌తాకాల‌పై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ఈ మూవీని నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుద‌ల చేసింది.

ఇండియ‌న్ సినిమాల్లో రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ద‌ర్శకుడు అప్సర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండగా.. ఇప్పటి వ‌ర‌కు న‌టించ‌ని ఓ డిఫ‌రెంట్ రోల్‌లో సందీప్ మాధ‌వ్ క‌నిపించ‌నున్నారు. ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్టర్‌ను గ‌మ‌నిస్తే హీరో సందీప్ మాధ‌వ్ రౌడీల‌ను చిత‌క్కొడుతున్నారు. హీరో చేతులు ఓ కుర్చీకి కట్టేసి ఉన్నాయి. ఇవ‌న్నీ చూస్తుంటే గంధ‌ర్వ సినిమాలో భారీ యాక‌్షన్ స‌న్నివేశాలుంటాయ‌ని తెలుస్తుంది. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. నాగు.వై ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ర్యాప్ రాక్ ష‌కీల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరంజ‌న్ జె.రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు