కుటుంబమంతా చూసేలా ఉంటుంది

20 Jun, 2022 04:44 IST|Sakshi

– హీరో సందీప్‌ మాధవ్‌

‘‘గంధర్వ’ యూత్‌ఫుల్‌ సినిమా కాదు. కుటుంబమంతా కలిసి చూసే చిత్రం. శ్రీకాంత్, జగపతిబాబుగార్లు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు చేశారు. ఈ జనరేష¯Œ లో ‘గంధర్వ’ ద్వారా నాకు మంచి అవకాశం వచ్చింది’’ అని హీరో సందీప్‌ మాధవ్‌ అన్నారు. అప్సర్‌ దర్శకత్వంలో సందీప్‌ మాధవ్, గాయ్రతి ఆర్‌.సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. సుభాని నిర్మించిన ఈ సినిమా ఎస్‌కే ఫిల్మ్స్‌ ద్వారా జూలై 1న రిలీజ్‌ కానుంది.

సందీప్‌ మాధవ్‌ మాట్లాడుతూ–‘‘గంధర్వ’ కథని లాక్‌డౌన్‌లో విన్నాను. మిలటరీ వ్యక్తి కుటుంబంలో వాతావరణం ఎలా ఉంటుంది? పెళ్లి అయిన మరుసటిరోజే యుద్ధానికి వెళ్లాల్సివస్తే పరిస్థితి ఏంటి? వంటి అంశాలున్నాయి. ఈ కథ 1971లో మొదలై 2021 వరకు రన్‌ అవుతుంది. దర్శకుడు అప్సర్‌ సోదరుడే నిర్మాత సుభానిగారు.. ఎక్కడా రాజీ పడలేదు. ఎస్‌.కె. ఫిలిమ్స్‌ ద్వారా సురేష్‌ కొండేటిగారు మా సినిమాని విడుదల చేస్తుండటంతో జనాలకు బాగా రీచ్‌ అవుతోంది. రామ్‌గోపాల్‌ వర్మ, పూరి జగన్నాథ్‌గార్లకు 24 గంటలు సినిమానే ప్రపంచం.. వారితో పనిచేసేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రస్తుతం ‘మాస్‌ మహారాజ్‌’ అనే సినిమా చేస్తున్నా’’ అన్నారు.
 

మరిన్ని వార్తలు