'రాజా విక్రమార్క'గా కార్తికేయ..ఫస్ట్‌లుక్‌ విడుదల

20 Jun, 2021 15:16 IST|Sakshi

ఆర్‌ఎక్స్‌‌100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు కార్తికేయ. అయితే ఈ సినిమా అనంతరం ఆ స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోతున్నాడు ఈ యంగ్‌ హీరో. ఇటీవలె కార్తికేయ నటించిన చిత్రం చావు కబురు చల్లగా యావరేజ్‌ టాక్‌ను సంపాదిచుకుంది. ప్రస్తుతం వి. వి. వినాయక్ అసోసియేట్ శ్రీసరిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి 'రాజా విక్రమార్క' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. 1990లో ఇదే టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను డైరెక్టర్‌ సందీప్‌ వంగా రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కార్తికేయ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

ఇక ఈ మూవీలో ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కార్తికేయకు జోడీగా నటించనుంది. ఈ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న తాన్యా క్లాసికల్‌ డ్యాన్సర్‌ అని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తమిళంలో విజయ్ సేతుపతి, అధర్వ మురళీ సరసన నటించింది.  ఈ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న తాన్యా క్లాసికల్‌ డ్యాన్సర్‌ అని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తమిళంలో విజయ్ సేతుపతి, అధర్వ మురళీ సరసన నటించింది. రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మెంటల్‌ మదిలో’, ‘దొరసాని’, ’అంతరిక్షం’ చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్‌ ఆర్‌. విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

చదవండి : హీరో కార్తికేయకు ఊహించని షాకిచ్చిన పోలీసులు
వైరల్‌ : షూటింగులో హీరో విశాల్‌కు తప్పిన పెద్ద ప్రమాదం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు