‘ప్రేమ విమానం’.. షూటింగ్‌ షురూ

16 Aug, 2022 10:16 IST|Sakshi

సంగీత్‌ శోభన్, శాన్వీ మేఘన జంటగా సంతోష్‌ కట దర్శకత్వంలో ‘ప్రేమ విమానం’ చిత్రం షురూ అయింది. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి గీతా ఆర్ట్స్‌ బాబీ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఏషి యన్‌ గ్రూప్స్‌ భరత్‌ నారంగ్‌ క్లాప్‌ ఇచ్చారు. సునీల్‌ నారంగ్‌ స్క్రిప్ట్‌ అందించారు. ‘‘న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి  సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: జగదీష్‌ చీకటి.

మరిన్ని వార్తలు