అందుకే అతడితో విడిపోయా: హీరో కూతురు

25 Apr, 2021 15:00 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కూతురు త్రిశాలా దత్‌ అందరికీ తెలిసే ఉంటుంది. సంజయ్‌దత్‌, ఆయన మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిశాలా. ప్రస్తుతం ఈమె న్యూయార్క్‌లో సైకోథెర‌పిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. అయితే అక్కడ తను ఓ వ్యక్తితో సుదీర్ఘ కాలం ప్రేమలో మునిగి తేలి ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల త్రిశాలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సుదీర్ఘ ఆమె సమాధానమిచ్చారు. 

ఈ క్రమంలో ఓ వ్యక్తి తన బ్రేకప్‌ గురించి అడగ్గా.. ఏడేళ్ల తన సుదీర్ఘ రిలేషన్‌షిప్‌లో ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అంతేగాక తన మాజీ ప్రియుడు తనని మోసం చేసినట్లు కూడా తెలిపారు. ‘నా 7 ఏళ్ల రీలేషన్‌ ఎందుకు ముగిసిందనే దానిపై నేను ఖచ్చితమైన వివరణ ఇవ్వలేను. అయితే మేము ఇద్దరం ఇష్టంగానే విడిపోయాం. ఎందుకుంటే నా నుంచి విడిపోవడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మా మధ్య ఎన్నో విభేదాలు, చాలా తేడా ఉంది. అయితే ఇన్నేళ్లు అవి బయట పడలేదు అంతే.

ఇక నా జీవితం నుంచి అతడు వెళ్లిపోయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అతడు నా నుంచి విడిపోయేందుకు ఎప్పుడు సిద్దంగా ఉండేవాడు. సంతోషంగా నా నుంచి వెళ్లిపోయినందుకు అతడికి నా అభినందలు’ అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా అతడిని ఆమె ఎంతగానో ప్రేమించినప్పటికి అతడు తనని చాలా చెత్తగా చూసేవాడని చెప్పారు. తను ఏం చేసినా విమర్శించడం, తప్పులు వెతకడం చేసేవావట. చివరికి ఆమె మిత్రులను కలిసిన ఇష్టపడేవాడు కాదని, చివరకు అతని కోసం మిత్రులను కలవడం, వారి సరదగా గడపడం కూడా వదులుకున్నట్లు చెప్పారు. అయితే అతడు ఎప్పటికైనా మారతాడనే ఆశతో అంతకాలం అతడిని భరించానని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు