ప్రభాస్‌తో సంజూ భాయ్‌!

27 Sep, 2022 03:31 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌(అభిమానులు ముద్దుగా సంజూభాయ్‌ అని పిలుస్తారు) స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాడీలక్స్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో స్టార్ట్‌ కానుంది. అయితే ఈ మూవీలోని ఓ కీలక పాత్ర కోసం సంజయ్‌ దత్‌ను సంప్రదించారట మారుతి. హారర్‌ అండ్‌ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ నటిస్తారా? లేదా? వేచిచూడాలి.

టీజర్‌ రెడీ...  
ప్రభాస్‌ హీరోగా నటించిన మరో చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. కాగా ఈ సినిమా టీజర్‌ని అక్టోబరు 2న విడుదల చేయనున్నారని టాక్‌. మైథలాజికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు.

మరిన్ని వార్తలు