Sanjay Dutt: మరిన్ని దక్షిణాది చిత్రాలు చేయాలనుంది..

21 Oct, 2022 19:38 IST|Sakshi

ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్‌ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అది ఒకప్పుడు, ఇప్పుడు సీన్‌ మారింది. బాలీవుడ్‌ మీద దండయాత్ర చేస్తోంది సౌత్‌ ఇండస్ట్రీ. వరుస సినిమాలను వదులుతూ హిందీ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది. దక్షిణాది సినిమాలకు ఫిదా అయిపోతున్న జనాలు సౌత్‌ ఇండస్ట్రీకి జై కొడుతున్నారు. 

కన్నడ చిత్రాలైన కేజీఎఫ్‌, కాంతార హిందీలో అఖండ విజయాలను నమోదు చేసుకున్నాయి. తాజాగా మరో కన్నడ చిత్రం కేడీ- ద డెవిల్‌ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. గురువారం బెంగళూరులో కేడీ టైటిల్‌ టీజర్‌ను దర్శకుడు ప్రేమ్‌, నటుడు సంజయ్‌ దత్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ దత్‌ మాట్లాడుతూ దక్షిణాదిలో మరిన్ని చిత్రాల్లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు.

'నేను కేజీఎఫ్‌లో చేశాను, ఇప్పుడు డైరెక్టర్‌ ప్రేమ్‌తో కేడీ సినిమా చేస్తున్నాను. కేడీ టీజర్‌ చాలా బాగుంది. సౌత్‌లో వారి ప్రేమను, శక్తిని, హీరోయిజాన్ని, ప్యాషన్‌ను.. అన్నింటినీ సినిమాలపై కుమ్మరించి చూపిస్తారు. దక్షిణాదిలో మరిన్ని సినిమాలు చేయాలనుంది. బాలీవుడ్‌ కూడా తన మూలాలు మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా ధృవ్‌ సర్జా హీరోగా నటించిన కేడీ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.

చదవండి: జిన్నా మూవీ రివ్యూ
కాంతారపై కంగనా రనౌత్‌ రివ్యూ

మరిన్ని వార్తలు