నెరిసిన జుట్టుతో సంజయ్‌ దత్ ఫోటో వైరల్

1 Mar, 2021 16:18 IST|Sakshi

కేన్సర్‌ నుంచి కోలుకున్న తర్వాత బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్‌–2’లో అధీరా పాత్రలో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాల్లో నటిస్తూ యాక్టివ్‌గా ఉన్నారు సంజయ్‌ దత్‌. తాజాగా ఆయన కుటుంబం దుబాయ్‌లో సేదతీరుతోంది. ఆయన భార్య మన్యతా దత్..‌ భర్త సంజయ్‌ దత్‌, పిల్లలతో కలిసి దిగిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘దేవుడి కృపను కలిగి ఉన్నా’ అని కామెంట్‌ జత చేయడంతో పాటు ఆశావాదం, అందమైన జీవితం, దయ, దత్‌.. అనే హ్యాష్‌ ట్యాగ్స్‌ జోడించారు.

ఈ ఫోటోలో సంజయ్‌ దత్‌ బూడిద రంగు జుట్టుతో కనిపిస్తున్నారు. గత ఏడాది సంజయ్ దత్ కేన్సర్‌ బారినపడి చికిత్స తీసుకొని కేన్సర్‌ను జయించిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో సంజయ్‌ దత్‌ తన భార్య మన్యతా, కుమారులు షహ్రాన్, ఇక్రాలతో కూడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్ దత్ చివరగా సడక్-2లో కనిపించారు. అదే విధంగా మృదు తెరకెక్కించే ‘తులసీదాస్‌ జూనియర్’‌ సినిమా నటించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో స్పూకర్‌ నేపథ్యంలో తెరకెక్కనుంది. దలీప్‌ తాహిల్, వరుణ్‌ బుద్ధదేవ్, రాజీవ్‌ కపూర్‌ తదితరులు ఈ మూవీలో నటించనున్నారు.
 

A post shared by Maanayata Dutt (@maanayata)

చదవండి: మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ లవ్‌ స్టోరీ..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు