కంగనా కామెంట్లు; అందుకు నేను సిద్ధం

6 Sep, 2020 16:46 IST|Sakshi

ఏదేమైనా కంగనా క్షమాపణలు చెప్పాల్సిందే

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

ముంబై: మహారాష్ట్రను కించపరిస్తే సహించేది లేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరోసారి స్పష్టం చేశారు. మహారాష్ట్ర, ముంబై, మరాఠాలు.. ఈ మూడింటిపై మితిమీరి మాట్లాడొద్దని అన్నారు. ఇక్కడ పుట్టి పెరిగినవారైనా, బయటివారైనా నీడనిచ్చిన ప్రాంతంపై నోరుపారేసుకోవద్దని ఆయన హితవు పలికారు. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) పోల్చిన కంగనా రనౌత్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కంగనా ట్వీట్లపై స్పందించే క్రమంలో తానేమైనా తప్పుగా మాట్లాడితే క్షమాపణలు కోరడానికి సిద్ధమని సంజయ్‌ ఆదివారం ప్రకటించారు. 

కాగా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి బాలీవుడ్‌లో బంధుప్రీతి, అతనికి అవమానాలే కారణమని కంగనా తొలి నుంచీ ఆరోపిస్తోంది. కేసు విచారణకు సంబంధించి ముంబై పోలీసులపై నమ్మకం లేదని ట్వీట్‌ చేయడంతో వివాదం మొదలైంది. అయితే, ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడ అడుగుపెట్టవద్దని ఎంపీ సంజయ్‌ రౌత్‌ కౌంటర్‌ వేశారు. దీనిపై స్పందించిన కగనా శివసేన ఎంపీ తనను బహిరంగంగా బెదిరిస్తున్నారని, ముంబై నగరం తనకిప్పుడు పీఓకే కనిపిస్తోందని ట్వీట్‌ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. ఈ నెల 9న ముంబై వస్తున్నాని దమ్ముంటే తనను ఆపాలని కంగనా మరో ట్వీట్‌తో విమర్శకులపై విరుచుకుపడ్డారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు