Sankranti 2022 Movies: సంక్రాంతి బరిలో స్టార్‌ హీరోలు.. విజయమెవరిది?

22 Oct, 2021 16:22 IST|Sakshi

టాలీవుడ్ కు కాసులు కురిపించే సీజన్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండగ మాత్రమే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరోనా సమయంలోనూ సంక్రాంతి సీజన్ కు విడుదలైన సినిమాలు కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీస్ ను షేక్ చేసాయి. అందుకే ఈసారి మ్యాగ్జిమమ్ స్టార్స్ సంక్రాంతి సీజన్ కు సై అంటున్నారు.

ఈసారి సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని పోటీ కనిపించనుంది. ఎందుకంటే ఒక వైపు సూపర్ స్టార్ మరో వైపు పవర్ స్టార్ ఇంకో వైపు రాధే శ్యామ్‌.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే కన్ ఫామ్ చేసారు. జనవరి 7న ఆర్‌ఆర్‌ఆర్‌  రిలీజ్ అవుతున్నప్పటికీ సంక్రాంతికే వస్తున్నామని మాటిమాటికి రిలీజ్ డేట్  పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. జనవరి 12న పవన్ కల్యాణ్‌, రానా హీరోలుగా నటిస్తున్న  భీమ్లానాయక్ విడుదల కానుంది. ఇక జనవరి 13న మహేశ్‌ బాబు సర్కారువారి పాటతో రానున్నాడు. 

అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే.ఆ రోజున స్పెషల్ టీజర్ రిలీజ్ చేయనుంది రాధే శ్యామ్ యూనిట్. అందుకు సంబంధించిన పోస్టర్ పై కూడా జనవరి 14న ఈ మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఈ మూడు భారీ చిత్రాలతో పాటు మరో రెండు ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్స్ కూడా పోటపడబోతున్నాయంట.

ఈ మూడు చిత్రాలతో పాటు ఎఫ్ 3 కూడా రిలీజ్ కానుందని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లే మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు కూడా ఈ సంక్రాంతి సీజన్ కు రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అప్పుడు సంక్రాంతి సమరం మరింత ఆసక్తికరంగా మారుతుంది.

2016లో సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సంచలన విజయం సాధించింది. కింగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే మరోసారి సంక్రాంతి సీజన్ లోనే ఈ సినిమా సీక్వెల్ ను విడుదల చేయాలనుకుంటున్నారట.నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి కనువిందు చేయనుంది. నాగ చైతన్య, కృతి శెట్టి తొలిసారి కలసి నటిస్తున్నారు. మనం తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలసి స్టెప్పులేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు