సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 గ్రాండ్‌ ఈవెంట్‌ ఎప్పుడంటే..

24 Nov, 2022 04:31 IST|Sakshi

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందచేస్తూ వస్తున్న అనేక అవార్డులలో ‘సంతోషం’ అవార్డ్సు ఒకటి. ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సౌత్‌ ఇండియన్‌ ఫిలిం అవార్డ్స్‌’కి తేదీ ఖరారు అయింది. డిసెంబర్‌ 26న హైదరాబాద్‌లో ‘21వ సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిలిం అవార్డ్స్‌ 2022’ వేడుకలు జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు

‘‘తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలకు అవార్డులు అందించనున్నాం. ఈ వేడుకలో  భాగంగా 12 గంటలపాటు నాన్‌స్టాప్‌ వినోదం ఉంటుంది’’ అని సంతోషం పత్రికాధినేత, నిర్మాత సురేష్‌ కొండేటి అన్నారు. 

మరిన్ని వార్తలు